IND vs SL : కొలంబో టెస్టులో భారత బౌలర్ల పాలిట విలన్లా మారాడు సొనాల్ దినుష(52 నాటౌట్). తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో శ్రీలంకను ఆదుకున్న ఈ కుర్రాడు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ క్రీజునంటుకుపోయాడు. టీమిండియా స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొంటూ.. వరసగా నాలుగో అర్ధ శతకం సాధించాడీ లెఫ్ట్ హ్యాండర్. కేషర నువాంత(41 నాటౌట్)తో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన దినుష.. లంక ఆధిక్యాన్ని పెంచుతూ పోతున్నాడు.
శ్రీలంకను క్లీన్‌స్వీప్ చేసి వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ముందంజ వేయాలనుకున్న భారత జట్టును సొమాల్ దినుష(52 నాటౌట్) విసిగిస్తున్నాడు. ఫాలోఆన్‌లో పడినా మంచి పోరాటపటిమ ప్రదర్శించిన లంక ఆఖరి రోజుకు తీసుకెళ్లిన రెండో టెస్టులో అతడు క్రీజునంటుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో (103 రన్స్‌తో మెరిసిన దినుష.. ఐదో రోజూ జోరు చూపిస్తూ అర్ధ శతకం బాదేశాడు. కేషర నువాంత(41 నాటౌట్)తో కలిసి అతడు శతక భాగస్వామ్యం నెలకల్పాడు. దాంతో.. తొలి సెషన్లోనే లంక ఆధిక్యం వంద దాటింది.
Fourth consecutive 50+ score for Sonal Dinusha 👏
𝟓𝟎-𝐩𝐥𝐮𝐬 𝐬𝐜𝐨𝐫𝐞𝐬 𝐢𝐧 𝐟𝐢𝐫𝐬𝐭 𝐟𝐨𝐮𝐫 𝐓𝐞𝐬𝐭 𝐢𝐧𝐧𝐢𝐧𝐠𝐬 𝐚𝐠𝐚𝐢𝐧𝐬𝐭 𝐈𝐧𝐝𝐢𝐚
Douglas Jardine (ENG, 1932-1934)
Everton Weekes (WI, 1948)
Clyde Walcott (WI, 1948)
Ken Barrington (ENG, 1959)
Sonal Dinusha… pic.twitter.com/Ku0hZGlYCp— Cricbuzz (@cricbuzz) August 27, 2026
టీమిండియా 503/9తో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాక.. శ్రీలంక గొప్పగా పోరాడింది. 213 పరుగుల లోటు స్కోరు.. ఫాలోఆన్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక వర్షం కారణంగా ముందుగానే ముగిసిన నాలుగో రోజు ఆట చివరకు 229/6తో ఓటమికి ఎదురీదుతోంది.
పసిందు సూర్యబండార (173 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 92), కమిందు మెండిస్ (55) అర్ధ శతకాలతో ఆతిథ్య జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా భారత బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి దెబ్బకొట్టారు. మానవ్ సుతార్ (2/81) రెండు వికెట్లతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దినుషా (7 బ్యాటింగ్), కేశర నువంతా (3 బ్యాటింగ్) క్రీజులో ఉండగా.. నాలుగో రోజు ఆట ముగిసే సరికి లంక 16 పరుగుల ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
A strong first innings resistance from the impressive Sonal Dinusha in Colombo 👊
More 📲 https://t.co/5UzOw3jjtg pic.twitter.com/6eCmasn8ZH
— ICC (@ICC) August 27, 2026