Alpha OTT | ఓటీటీలోకి ఆలియా భట్ ‘ఆల్ఫా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Alpha OTT | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt), యంగ్ టాలెంటెడ్ నటి శర్వరి వాఘ్ ప్రధాన పాత్రల్లో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' (Alpha) త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
Alpha OTT | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt), యంగ్ టాలెంటెడ్ నటి శర్వరి వాఘ్ ప్రధాన పాత్రల్లో నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ (Alpha) త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఈ సినిమా ఆగస్ట్ 28 నుంచి ప్రేక్షకులను అలరించనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ (YRF) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తొలి లేడీ స్పై యాక్షన్ చిత్రంగా ‘వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్’ (YRF Spy Universe) నుంచి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివ్ రావల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆలియా భట్, శర్వరి ఇద్దరూ పవర్ఫుల్ అండ్ డేరింగ్ సీక్రెట్ ఏజెంట్లుగా కనిపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ మరియు విలక్షణ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించగా, వారి నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ స్పై థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీ ద్వారా డిజిటల్ ఆడియన్స్‌ను అలరించడానికి రాబోతోంది. అయితే, ప్రస్తుతం ఈ చిత్రం హిందీ స్ట్రీమింగ్కు సంబంధించి అధికారిక ప్రకటన రాగా, తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల డబ్బింగ్ విడుదలపై త్వరలోనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Get ready to join the Alpha gang ❤️🔥 pic.twitter.com/NSPLHTHDeI
— Netflix India (@NetflixIndia) August 27, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
Priyanka Gandhi | ‘దేశంలో ప్రజాస్వామ్యం లేదా..?’ కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

