నందికొండ, డిసెంబర్ 12 : అంతర్జాతీయ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్ అసోసియేషన్ (ఏబీటీవో) అధ్యక్షుడిగా బుద్ధవనం మాజీ ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య నియమితులయ్యారు. బీహార్లోని వైశాలిలో ఈ నెల 10న నిర్వహించిన ఏబీటీవో వార్షికత్సోవంలో ఆయన్ను ఎన్నుకున్నారు.
లక్ష్మయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర, దేశ, విదేశీ స్థాయిలో బుద్ధిస్ట్ సంఘాలను సమైక్యపరుస్తూ బౌద్ధమత వ్యాప్తికి కృషి చేస్తానని తెలిపారు.