హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్‌గా మల్లేపల్లి లక్ష్మయ్య మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్‌రంజన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్లేపల్లి లక్ష్మయ్య గతంలో 2016-2024 వరకు ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.
బ్రహ్మంగావ్ లిఫ్టుకు రూ.5.88కోట్లు
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లా బాసర మండలం కౌట గ్రామంలోని బ్రాహ్మంగావ్ లిఫ్టు ఇరిగేషన్ పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.5.88 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.