హైదరాబాద్, ఫిబ్రవరి 23: మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేయడం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సప్‌లో ఎక్కడ చూసినా మల్లన్నసాగర్ ఫోటోలు, వీడియోలు, విశేషాలే కనిపించాయి. ట్విట్టర్లో దాదాపుగా 40 వేలకు పైగా మల్లన్నసాగర్‌పై ట్వీట్‌చేశారు. దీంతో దేశంలోనే టాప్ ట్రెండింగ్ అంశంగా నిలిచింది.
సస్యశ్యామలం చేస్తున్న కేసీఆర్: మహేశ్ బిగాల
మల్లన్నసాగర్ ద్వారా తెలంగాణను కేసీఆర్ సస్యశ్యామలం చేస్తున్నారని టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. బుధవారం తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులో భాగంగా మరో కీలకఘట్టం ఆవిషృతం అయిందని ఒక ప్రకటనలో తెలిపారు.
కేసీఆర్ మాట ఇస్తే అంతే: ఎంపీ సంతోష్
సీఎం కేసీఆర్ ఒకసారి మాట ఇస్తే అది అమలు కావాల్సిందేనని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం మల్లన్నసాగర్‌ను జాతికి అంకితం చేసిన సందర్భంగా ట్వీట్ చేశారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను చేరుకోవడానికి నీరు ప్రవహిస్తున్న అద్బుతమైన దృశ్యాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. మల్లన్న చెంతకు గోదారి నీళ్లను తెస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని నెరవేర్చారని ట్విట్టర్లో పేర్కొన్నారు.