హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించేందుకు ఇదే మంచి తరుణమని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా చెప్పారు. రాహుల్ పబ్లికేషన్స్ ప్రచురించిన పోలీస్ రిక్రూట్మెంట్ పోటీ పరీక్షల పుస్తకాలను శనివారం లక్డీకాపూల్లోని తన కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఉద్యోగ భర్తీకి వరుస ఇస్తున్న నోటిఫికేషన్ల యువత వినియోగించుకోవాలని సూచించారు.