హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆర్టీసీలో స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ సీమ్ లబ్ధిదారులకు సంస్థ భారీ ఊరటనిచ్చింది. విశ్రాంత ఉద్యోగులు, వారి జీవిత భాగస్వాములు తమ నెలవారీ నగదు ప్రయోజనాన్ని పొందడానికి ఇకపై డిపోల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ ‘జీవన్ ప్రమాణ్’ పోర్టల్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను (డీఎల్సీ) సమర్పించే వెసులుబాటును కల్పిస్తూ టీజీఎస్ ఆర్టీసీ ఎస్ఆర్బీఎస్ చైర్మన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.