హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : కార్పొరేట్ సామాజిక బాధ్యత తరహాలో అకాడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (ఏఎస్ఆర్)ను విస్తృతంగా ప్రోత్సహిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి తెలిపారు. అన్ని స్థాయిల్లో అకాడమిక్ ఆడిటింగ్ చేపడుతామని పేర్కొన్నారు. నైపుణ్యాధారిత విద్యాకోర్సులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. డిగ్రీ కోర్సుల్లో భారీగా సీట్లు మిగులుతున్నాయని, రేషనలైజేషన్‌ను చేపడుతామని వెల్లడించారు. బీటెక్ యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్లో భర్తీచేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.