హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆరిజిన్ డెయిరీ నిర్వాహకుల మధ్య తలెత్తిన వివాదంలో జాతీయ మహి ళా కమిషన్ కలుగజేసుకుంది.
తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకొని, న్యాయం చేయాలని కోరుతూ డెయిరీ సీఏవో శేజల్ ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ను కోరారు. దీనిపై విచారణ జరిపి 15 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ మహిళా కమిషన్ తెలంగాణ డీజీపీ కార్యాలయానికి మెయిల్ పంపింది.