హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని మహీం ద్రా విశ్వవిద్యాలయంలో సూల్ ఆఫ్ డిజైన్ ఇన్నోవేషన్ కోర్సును ప్రారంభించినట్టు వీసీ డాక్టర్ యాజులు మేడూరి తెలిపారు. పినిన్ ఫరీనా డిజైన్ అకాడమీ, టొరినో, ఇటలీ, షెనోయ్ ఇన్నోవేషన్ స్టూడియో ఐడీసీ ఐఐటీబీతో సూల్ ఆఫ్ డిజైన్ ఇన్నోవేషన్ భాగస్వామ్యంతో కోర్సును ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
తొలి అకడమిక్ సెషన్ వచ్చేనెల 15 నుంచి బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ ఇన్ డిజైన్తో ప్రారంభమవుతుందని వెల్లడించారు. 10+2 విద్యార్థులు ఈ కోర్సుకు అర్హులని తెలిపారు.