హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): న్యూజిలాండ్‌లో మృతిచెందిన వంశీరెడ్డి చింతారెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల వెల్లడించారు. ఎమ్మెల్సీ తాతా మధు ఆధ్వర్యంలో వంశీ బంధువులు మహేశ్ బిగాలను కలిశారు.
న్యూజిలాండ్‌లోని టీఆర్ఎస్ ఎన్నారై అధ్యక్షుడు జగన్ వొదనల, తెలంగాణ సీనియర్ నాయకుడు కాసుగంటి కల్యాణ్‌రావు.. వంశీ మృతదేహం తెచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారని మహేశ్ బిగాల తెలిపారు. తెలంగాణ ఎన్నారై ఇన్చార్జీ చిట్టిబాబు ఇప్పటికే అన్ని అన్ని ఏర్పాట్లు పూర్తికావచ్చాయని చెప్పినట్టు బిగాల పేర్కొన్నారు. తొమ్మిదేండ్ల క్రితం స్టూడెంట్ వీసాపై న్యూజిలాండ్ వెళ్లిన వంశీరెడ్డి చింతారెడ్డి అక్కడి ఆష్బర్టన్లో డైరీఫామ్ మేనేజర్‌గా పనిచేసేవారు.