హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెండో విడత సీట్ల కేటాయింపు జాబితాను వెబ్సైట్లో పెట్టామని ఎంజీపీ సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు పేర్కొన్నారు.
అభ్యర్థులు ఈ నెల 17 వరకు కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. వివరాలకు 040-23328266, https:// tgrdccet. cgg.gov. in/ TGRD CW EB/ లేదా https:// mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్, mjptbcwreis14 @ g mail.com మెయిల్ చేసుకునే సౌకర్యం కల్పించినట్టు తెలిపారు.