హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ‘అబ్ కీ బార్.. కిసాన్ సరార్’ నినాదంతో దేశంలో కిసాన్ ప్రభుత్వ ఏర్పాటు కోసం నడుం బిగించిన బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో రోజురోజుకూ బలోపేతమవుతున్నది. పార్టీలోకి మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం మహారాష్ట్రలోని వేర్వేరు ప్రాంతాల రాజకీయ నేతలు, పలు మారెట్ కమిటీలు, సహకార బ్యాంకుల మాజీ చైర్మన్లు, మాజీ వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, న్యాయవాదులు, చార్టెడ్ అకౌంటెం ట్లు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారందరికి సీఎం గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దేశ ప్రజల జీవితాల్లో సంపూర్ణ క్రాంతి రావాలంటే ‘కిసాన్ సరార్’తోనే సాధ్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వాలకు బాసులు ప్రజలేనని.. రైతులు, ప్రజలే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారని తెలిపారు. ‘ప్రజా ప్రభుత్వాలను మనమే ఏర్పాటు చేసుకుందాం. ఇదే విధానంతో మనం అబ్ కీ బార్ కిసాన్ సరార్ నినాదం ఇచ్చాం’అని చెప్పారు. పాలకుల వైఖరుల్లో మార్పు రానంత వరకూ అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు. ప్రజలకు తాగునీరు, సాగునీరు, విద్యుత్తు వంటి మౌలిక వసతులు కల్పించడానికి తెలంగాణలో ఎంతో కష్టపడి విధానాలు రూపొందించామని తెలిపారు.
కాళేశ్వరం ఫలితాలు అందుకొంటున్నామని, పాలమూరు-రంగారెడ్డి కూడా త్వరలో పూర్తవుతుందని పేర్కొన్నారు. పండిన పంటను ప్రాసెసింగ్ చేసి దేశవిదేశాలకు మారెటింగ్ చేసి రైతులకు మరిన్ని లాభాలు అందిస్తామని వివరించారు. ఇదే విధానం దేశవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. రైతు సంక్షేమం కోసమే బీఆర్ఎస్ కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన మహారాష్ట్ర నేతలను సీఎం కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకొన్నారు. కాళేశ్వరం వంటి అద్భుతాన్ని తామెకడా చూడలేదని, ఇదొక వరల్డ్ వండర్ అని మహారాష్ట్ర నేతలు కొనియాడారు.
Cmkcr
పెద్ద సంఖ్యలో చేరికలు
సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రలోని షుగర్ ఫ్యాక్టరీ సహకార సంస్థలకు చెందిన వందల మంది బీఆర్ఎస్లో చేరారు. అహ్మద్‌నగర్ జిల్లా శ్రీరాంపూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే భానుదాస్ కాశీనాథ్ మురుటే కూడా గులాబీ కండువా కప్పుకొన్నారు. మురుటే ఈ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈయన అశోక్ కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ యజమాని. అహ్మద్ నగర్ జిల్లా కో ఆపరేటివ్ బ్యాంకు డైరక్టర్ కూడా.
ముర్కుటేతోపాటు అశోక్ కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ వైస్ చైర్మన్ పుంజహరి తుకారాం షిండే, చైర్మన్ శ్రీరాంపూర్, న్యాయవాది సుభాష్ సకహరిదరి, షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్, లోక్‌సేవా వికాస్ అఘాడీ అధ్యక్షుడు శ్రీరాంపూర్ హిమ్మత్రావ్ మాధవరావు ధుమాల్, ఫ్యాక్టరీ మాజీ చైర్మన్, వైస్ చైర్మన్లు సురేశ్ మచింద్ర గలాండే, దిగంబర్ సర్జేరావ్ షిండే, బాబాసాహెబ్ పారాజీ కాలే, దత్తాత్రే నాయక్, డైరెక్టర్లు కొందిరామ్ బాబాజీ ఉండే, మోహన్ సలుంకే, భావుసాహెబ్ ధోందీరామ్ ఉండే, బాబాసాహెబ్ కడూజీ ఆదిక్, ఆదినాథ్ నివృత్తి జూరాలే, రమేశ్ నానాసాహెబ్ వారే, రాంభౌ తులసీరామ్ కాసర్, జ్ఞానేశ్వర్ బాబాసాహెబ్ కాలే, వీరేశ్ భావుసాహెబ్ గలాండే, యశ్వంత్ గోవింద్ బంకర్, యశ్వంత్ దినకర్ రానా నవారే, అబాసాహెబ్ బాబాసాహెబ్ గవారే, జ్ఞానేశ్వర్ బికాజీ షిండే, యోగేశ్ భావుసాహెబ్ విటానార్, నివృత్తి భగవత్ థోరత్, అమోల్ బాలాసాహెబ్ కోకనే, అచ్యుత్రావ్ గులాబ్రావ్ బదఖ్, ఉమేశ్ లాటిమేల్, రంజిత్ బంకర్, జితేంద్ర అశోక్ తోరణే, కిషోర్ షమ్రావ్ బన్సోడ్, కంపెనీ చైర్మన్ హరిదాస్ దాదా వేటల్, వైస్‌చైర్మన్ శివాజీ ముతే, లోక్‌సేవ వికాస్ అఘాడీ శ్రీరాంపూర్ యూత్ ప్రెసిడెంట్ గణేశ్ విశ్వనాథ్ భాకరే, మారెట్ కమిటీ శ్రీరాంపూర్ డైరెక్టర్ దశరథ్ విఠోబా పిస్, రాహురి, తదితరులు పార్టీలో చేరారు.