హైదరాబాద్, అక్టోబర్8(నమస్తే తెలంగాణ): అనూహ్యంగా మాదిగ రిజర్వేషన్ల డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల సంస్థల ఎన్నికల్లో తమకు మాదిగలకు 18% రిజర్వేషన్లు కల్పించాలని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితర నేతలు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మేరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల్లో (ఎస్సీ) మాదిగ సామాజిక వర్గం గణనీయమైన జనాభా కలిగి ఉన్నదని, రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా ఎన్నికల ఫలితాలపై ఈ వర్గం ఓట్ల ప్రభావం అధికంగా ఉంటుందని వారు ఈ సందర్భంగా తెలిపారు.