హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జాగృతి మహిళా సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌గా మరిపెల్లి మాధవి నియమితులయ్యారు. జాగృతి యువజన సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌గా ఎదురుగట్ల సంపత్‌గౌడ్, జాగృతి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్‌గా అప్పాల నరేందర్ యాదవ్, జాగృతి విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌గా జానపాటి రాము యాదవ్, జాగృతి యువజన సమాఖ్య హైదరాబాద్ కన్వీనర్‌గా పరకాల మనోజ్‌గౌడ్ ఎంపికయ్యారు.
ఈ నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. తెలంగాణ జాగృతిని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడానికి ఈ నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు.