హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): మొన్నటి వరకు సామాన్యుడిని బెంబేలెత్తించిన టమాట ధర దిగొచ్చింది. మదనపల్లె మార్కెట్లో శుక్రవారం మొదటిరకం కేజీ టమాట రూ.9లు పలికింది. నిత్యవసర సరకుల్లో ఒకటైన టమాట ధరలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే పలు రాష్ర్టాల్లో కిలో రూ.50-రూ.25 పలుకుతుండగా, చాలా చోట్ల రూ.15, రూ.20కు దొరుకుతున్నాయి.
హైదరాబాద్లో కిలో మొదటి రకం రూ.25-రూ.20 దాకా పలుకుతోంది. గడిచిన నెల రోజులుగా తెలంగాణ, ఏపీతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో కొత్త పంట మార్కెట్లోకి రావడంతో సరఫరా పెరిగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా ధరలు నేలకు పడిపోయాయి.