బంజారాహిల్స్, అక్టోబర్ 17: బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ వైద్య విజ్ఞాన సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ గార్గ్ ప్రతిష్ఠాత్మక అకడెమియా ఆప్తల్మాలజికల్ ఇంటర్నేషనల్స్ (ఏవోఐ) సభ్యుడిగా ఎన్నికయ్యారు.
అంతర్జాతీయస్థాయిలో నేత్ర వైద్యంలో పరిశోధనలతోపాటు విశేష సేవలు అందిస్తున్న 100 మంది కంటి వైద్య నిపుణులు, పరిశోధకులకు మాత్రమే చోటు ఉండే ఈ సంస్థలో మన దేశం నుంచి ఐదుగురు మాత్రమే చోటు సంపాదించుకున్నారు. ప్రశాంత్ గార్గ్‌కు ఏవోఐలో చోటు దక్కడంపై ఎల్వీప్రసాద్ వైద్య విజ్ఞాన సంస్థ వైద్యులు అభినందించారు.