ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బీసీలకు నష్టం
అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుతో బీసీలకు తీరని నష్టం వాటిల్లనున్నదని సర్వాయిపాపన్న మోకుదెబ్బ (గౌడ సంఘం) వ్యవస్థాపక అధ్యక్షుడు జకే వీరస్వామిగౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.
- సర్వాయిపాపన్న మోకుదెబ్బ రాష్ట వ్యవస్థాపక అధ్యక్షుడు వీరస్వామిగౌడ్
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుతో బీసీలకు తీరని నష్టం వాటిల్లనున్నదని సర్వాయిపాపన్న మోకుదెబ్బ (గౌడ సంఘం) వ్యవస్థాపక అధ్యక్షుడు జకే వీరస్వామిగౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. 50 శాతం రిజర్వేషన్లు దాటకూడదని గతంలో చెప్పిన సుప్రీం కోర్టే.. ఇప్పుడు తీర్పు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు.
దేశం మొత్తంలో అగ్రవర్ణాలు 10 శాతం కూడా లేరని, అందులో పేదలు 2 శాతం కూడా దాటరని.. వారికి 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బీసీలు 60 శాతం ఉంటే కేవలం 27 శాతం రిజర్వేషన్ ఉన్నదని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొన్ని వర్గాల చేతుల్లో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు.బీసీ కుల సంఘాలు ఒకటై ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అడ్డుకోవాలని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించేవరకూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

