హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): సివిల్ సర్వీస్‌కు సన్నద్ధమవుతున్న బీసీ అభ్యర్థులకు లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నారు. ఈ మేరకు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్‌కుమార్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందుకు ఓయూలోని బీసీ స్టడీ సర్కిల్లో ఈ నెల 26 నుంచి జూలై 10వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని, వివరాల కోసం 040 27077929, 77803 59322 నంబర్లలో సంప్రదించాలని డైరెక్టర్ సూచించారు.
మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో…
మైనార్టీ అభ్యర్థుల కోసం మైనార్టీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో యూపీఎస్సీ సీసాట్ శిక్షణ ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ నెల 26 నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 13న స్క్రీనింగ్ పరీక్ష ఉంటుంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.