హైదరాబాద్, జులై 14 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీలో ఈ నెల 15న ఆల్ ఇండియా స్పీకర్స్, కౌన్సిల్ చైర్మన్లతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశం కానున్నారు. కెనడాలో ఆగస్టు 20 నుంచి 26వరకు నిర్వహించే కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
సమావేశానికి రాష్ట్రం నుంచి అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు హాజరుకానున్నారు.