e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేత‌

రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేత‌

రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేత‌

హైద‌రాబాద్ : రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మ‌ధ్యాహ్నం స‌మావేశ‌మైన రాష్ట్ర కేబినెట్ ఈ మేర‌కు నిర్ణ‌యించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్ ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నది. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను మంత్రివ‌ర్గం ఆదేశించింది.

దేశవ్యాప్తంగానే కాకుండా, పొరుగు రాష్ట్రాల్లో కూడా కరోనా నియంత్రణలోకి వస్తున్న విషయాన్ని కేబినెట్ పరిశీలించింది. తెలంగాణలో ఇతర రాష్ట్రాలకంటే వేగంగా కరోనా నియంత్రణలోకి వ‌చ్చింద‌ని అధికారులు అందించిన నివేదికల ఆధారంగా కేబినెట్ నిర్దారించింది. ఈ మేరకు జూన్ 19 వరకు అమల్లో ఉన్న లాక్ డౌన్‌ను రేపటి నుంచి (జూన్ 20) సంపూర్ణంగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది.

జులై 1 నుంచి విద్యా సంస్థ‌లు ప్రారంభం

- Advertisement -

క‌రోనా తీవ్ర‌త‌ త‌గ్గుముఖం, లాక్‌డౌన్ ఎత్తివేత‌తో అన్ని కేటగిరీల విద్యా సంస్థలను పూర్తిస్థాయి సన్నద్థతతో జూలై 1 నుంచి ప్రారంభించాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. శ‌నివారం స‌మావేశమైన రాష్ట్ర మంత్రివ‌ర్గం ఈ మేర‌కు విద్యాశాఖ‌ను ఆదేశించింది. ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతో ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని కేబినెట్ కోరింది. లాక్ డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదంది.

తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం.. తదితర కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలంది. అందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కేబినెట్ స్పష్టం చేసింది. కరోనా పూర్తిస్థాయి నియంత్రణకు ప్రజలు త‌మ‌ సంపూర్ణ సహకారం అందించాలని కేబినెట్ కోరింది.

ఇవి కూడా చదవండి

భూ తగాదాలతో తండ్రీ, కొడుకుల దారుణ హత్య

పిల్ల‌ల‌తో రోడ్డుపైకి బాతు, ట్రాఫిక్ జామ్.. వీడియో వైర‌ల్‌

corona vaccine : క‌రోనా నుంచి కోలుకున్న వారికి వ్యాక్సిన్ రెండో డోస్ అక్క‌ర్లేదా? సింగిల్ డోసే స‌రిపోతుందా?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేత‌
రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేత‌
రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేత‌

ట్రెండింగ్‌

Advertisement