వాషింగ్టన్: ఓ బాతు పిల్లలతో కలిసి రోడ్డుపైకి వచ్చింది. దాంతో అటుగా వెళ్తున్న వాళ్లు తమ వాహనాలను ఎక్కడికక్కడే నిలిపేశారు. ఈ ఘటన అమెరికాలోని న్యూయార్క్ నగరంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. న్యూయార్క్‌లో అత్యంత రద్దీగా ఉండే రోడ్డుపైకి ఓ బాతు తన పిల్లలతోపాటు వచ్చేసింది. బాతు రాకను గమనించిన వాహనదారులు తమ వాహనాలను నిలిపేసి దానికి దారిచ్చారు.
దాంతో ఆ బాతు ఎంచక్కా వాహనాల కిందుగా తన పిల్లలతో కలిసి రోడ్డు దాటింది. ఆ తర్వాత రోడ్డు పక్కనే ఉన్న ఓ షాప్‌లోకి వెళ్లింది. ఈ ఘటనను వాహనదారులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రించారు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. గంటల వ్యవధిలోనే 1.6 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.