హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): రూ.2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుందని సీఎం వెల్లడించారు. రైతు రుణమాఫీ తర్వాత రైతుబంధు, ఇతర పథకాలపై దృష్టి పెడతామని వివరించారు. పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని, బంగారంపై తీసుకున్న రుణాలకు వర్తించదని స్పష్టంచేశారు. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని, అంతరాయాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు రోజుల్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయని తెలిపారు.