ప్రతిమలో చిన్నారికి కాలేయ మార్పిడి
అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి ఉచితంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసి పునర్జీవం పోశారు ప్రతిమ హాస్పిటల్ వైద్యులు. 11 నెలల అర్హాన్కు కామెర్లు సోకడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.మల విసర్జనలో రక్తస్రావం, పొత్తికడుపు ఉబ్బడంతోపాటు నొప్పిగా ఉండటం, దురద తదితర సమస్యలతో చిన్నారి నిర్విరామంగా ఏడ్చేవాడు.
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి ఉచితంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసి పునర్జీవం పోశారు ప్రతిమ హాస్పిటల్ వైద్యులు. 11 నెలల అర్హాన్కు కామెర్లు సోకడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మల విసర్జనలో రక్తస్రావం, పొత్తికడుపు ఉబ్బడంతోపాటు నొప్పిగా ఉండటం, దురద తదితర సమస్యలతో చిన్నారి నిర్విరామంగా ఏడ్చేవాడు. తల్లిదండ్రులు హైదరాబాద్లోని ప్రతిమ హాస్పిటల్లో చిన్నారిని చూపించారు.
హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డాక్టర్ మధుసూదన్ పర్యవేక్షణలో అర్హాన్కు వివిధ వైద్య పరీక్షలు చేశారు. చిన్నారి కాలేయం పూర్తిగా దెబ్బతిన్నదని, 60 వేల మందిలో ఒకరికి జన్యుపరంగా వచ్చే ‘అలగెల్లె’ సిండ్రోమ్తో బాధపడుతున్నట్టు నిర్ధారించారు. చిన్నారికి కాలేయ మార్పిడి ఒకటే మార్గమని వివరించారు. చిన్నారి తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో ఉచితంగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు, యాజమాన్యం నిర్ణయించారు. సర్జికల్ పరికరాలు, ఔషధాల కోసం డాక్టర్ మధుసూదన్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరించారు. రోగి తల్లి నుంచి కొంత కాలేయ భాగాన్ని సేకరించి చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

