హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న 7ఉమ్మడి జిల్లాల్లో మూడు రోజుల పాటు మద్యం షాపులు మూసివేయాలని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో 25 సాయంత్రం 4 నుంచి 27 సాయంత్రం 4 వరకు మద్యం షాపులు బంద్ చేయనున్నా రు. కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు కూడా బంద్ చేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. 27న సాయంత్రం 4 నుంచి యథావిధిగా మద్యం దుకాణాలు కొనసాగనున్నాయి.