KTR | పాలన గాలికి.. ప్రగతి కాటికి.. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికీ మద్యం: కేటీఆర్
ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికీ మద్యం అంటూ.. మేజర్ పంచాయతీల వరకే పరిమితమైన మద్యం దుకాణాలను పల్లెలకు విస్తరించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు.
హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికీ మద్యం అంటూ.. మేజర్ పంచాయతీల వరకే పరిమితమైన మద్యం దుకాణాలను పల్లెలకు విస్తరించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. గతంలో మద్యం అమ్మకాలపై విమర్శలు చేసిన హస్తం పార్టీ, అధికారం దక్కించుకున్న తర్వాత ఆదాయం కోసం మద్యం అమ్మకాలనే నమ్ముకున్నదని ధ్వజమెత్తారు. నాగు ప్రగతి బాట పట్టిన తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారని విమర్శించారు. మద్యం ప్రియుల బలహీనతను రాష్ట్ర ఖజానాకు ఆదాయ వనరుగా మార్చుకునేందుకు కుట్ర పన్నుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘నాడు కేసీఆర్ పాలనలో పల్లె, పల్లెకు ప్రగతి రథచక్రాలు. ప్రతి చేనుకు నీళ్లు.. ప్రతి చేతికి పని. ఇంటింటికి తాగునీళ్లు.. ఆడబిడ్డలకు తప్పిన ఇబ్బందులు. నాడు ప్రగతిబాట పట్టిన తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారని నిందలు. నేడు పల్లె, పల్లెలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి మద్యం ప్రియుల బలహీనతను రాష్ట్ర ఖజానాకు ఆదాయ వనరుగా మార్చుకునే కుట్ర. అన్ని రంగాలలో తెలంగాణ ప్రగతిని దెబ్బతీసి .. ఇప్పుడు తీరిగ్గా ఆదాయం కోసం మద్యం అమ్మకాలను నమ్ముకున్న అసమర్థ కాంగ్రెస్ సర్కార్.
ఏడాది క్రితం సగటున ఒక వ్యక్తి మద్యం కోసం చేసే ఖర్చు రూ.897. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో సగటున ఒక వ్యక్తి మద్యం మీద చేస్తున్న ఖర్చు రూ.1623కు పెరిగింది. లైసెన్స్ గడువు మూడేళ్లకు పెంచి, ధరఖాస్తు ధర రూ.3 లక్షలకు పెంచాలని నిర్ణయం. నాడు మద్యం అమ్మకాలపై విమర్శలు, నేడు అధికారం దక్కించుకుని ఆదాయం కోసం మద్యం అమ్మకాలనే నమ్ముకున్న కాంగ్రెస్ సర్కార్. ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికీ మద్యం. పాలన గాలికి.. ప్రగతి కాటికి’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి. .
చూసేవన్నీనిజాలు కాదు.. ఫేక్‌బుక్ ప్రచారం!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Congress
- Indiramma Palana
- KCR
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో దాడులు, దౌర్జాన్యాలతో జంగిల్ రాజ్ పాలన : మాజీ మంత్రి విడుదల రజిని
Puvvada Ajay | పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: పువ్వాడ అజయ్ కుమార్
‘బీఈడీలో యోగా సబ్జెక్ట్ భవిష్యత్ టీచర్లకు ఉపయుక్తం’
INS Srishti | ఐఎన్ఎస్ సృష్టి .. సముద్ర భద్రతకు స్వదేశీ బలం!
life imprisonment to priest | గుడిలో బాలికల వీడియోలు తీసి విదేశీయులకు విక్రయించిన పూజారి.. జీవిత ఖైదు విధించిన కోర్టు
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

