హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కేంద్ర పథకాలతో అనుసంధానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్ఆర్ఈజీఎస్, ఎస్బీఎం-గ్రామీణ, పీఎం జనమాన్ పథకాల కింద చేపట్టే పనులను ఇందిరమ్మ ఇండ్లకు వర్తింపజేశారు. గ్రామీణ ఇండ్లకు కేంద్రం నుంచి రూ.72 వేలు, పట్టణ ఇండ్లకు రూ.1.5 లక్షల చొప్పున పీఎంఏవై కింద మంజూరవుతున్నాయి.
ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటుచేయండి
హైదరాబాద్, ఆగస్టు19 (నమస్తే తెలంగాణ) : ఈడబ్ల్యూఎస్ కోసం జా తీయస్థాయిలో ప్రత్యేక కమిషన్తోపా టు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపారు. రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు మాధవరెడ్డి మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.