మహబూబాబాద్ రూరల్, నవంబర్ 21: మహబూబాబాద్ జిల్లా గిరిజనులకు సీఎం రేవంత్ భయపడ్డాడని లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు భీమానాయక్ అన్నారు. గురువారం మహబూబాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. లగచర్ల గిరిజనులకు మద్దతుగా మానుకోటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించే మహాధర్నాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడితోనే పోలీసులు అనుమతి ఇవ్వలేదని అన్నారు. కేటీఆర్ గిరిజనుల్లో చైతన్యం తీసుకొస్తారని సర్కార్ వణికిపోతుందని చెప్పారు.