హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా జీవితాంతం గడిపిన ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆం ధ్ర రాష్ట్రంలో విలీనం చేయడాన్ని జయశంకర్ వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఏపీలో విలీనంతో జరిగిన అన్యాయాన్ని ఎప్పటికప్పుడు వివరిస్తూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఆరు దశాబ్దాలు సజీవంగా ఉంచిన ఘనత ఆయనదేనని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): పదవీకాలం ముగిసిన మండల, జిల్లా పరిషత్‌లకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా పరిషత్‌లకు జిల్లా కలెక్టర్లను, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని అన్ని మండలాలు, ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం, మహబూబాబాద్ జిల్లా గార్ల, బ య్యారం మండల పరిషత్‌లకు ప్రత్యేక అధికారులను నియమించింది. కొత్త పాలకవర్గాలు ఎన్నికయ్యే వరకు వీరు కొనసాగుతారని పేర్కొంది.