బీటెక్ విద్యార్థినికి
తండ్రి మరణంతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న బీటెక్ విద్యార్థినికి న్యాయవాదులు అండగా నిలిచారు. బకాయి ఫీజులు చెల్లించేందుకు ముందుకువచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఓ విద్యార్థిని బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నది.
- న్యాయవాదుల చేయూత కాలేజీ ఫీజులు చెల్లిస్తామని భరోసా
హైదరాబాద్ , జూన్26 (నమస్తే తెలంగాణ): తండ్రి మరణంతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న బీటెక్ విద్యార్థినికి న్యాయవాదులు అండగా నిలిచారు. బకాయి ఫీజులు చెల్లించేందుకు ముందుకువచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఓ విద్యార్థిని బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నది.
ఐదో సెమిస్టర్ వరకు అన్ని ఫీజులు చెల్లించింది. గత నెల 12న తండ్రి మరణించడంతో విద్యార్థిని కుటుంబం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో తదుపరి సెమిస్టర్ ఫీజు చెల్లించలేకపోయింది. జూన్22న పరీక్షల రిజిస్ట్రేషన్ పోర్టల్ నుంచి విద్యార్థిని పేరును కాలేజీ యాజమాన్యం తొలగించింది. ఫలితంగా తొలి ఇంటర్నల్ పరీక్ష రాయలేకపోయింది. ఈ నేపథ్యంలో ఫీజు బకాయి కారణంగా పరీక్షలకు అనుమతించడం లేదంటూ సదరు విద్యార్థిని హైకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌ను జస్టిస్ శ్రీదేవి విచారించారు. కాలేజీకి సుమారు రూ.60 వేల ఫీజు బకాయి ఉందని, అందులో రూ.20 వేలు మాత్రమే తాను చెల్లించగలనని విద్యార్థిని గోడు వెళ్లబోసుకున్నది. కోర్టులోనే ఉన్న సీనియర్ న్యాయవాదులు, ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ సుబ్రమణ్యం, ఎస్ శ్రీరామ్, ఎల్ రవిచందర్ సదరు విద్యార్థిని దీనస్థితికి చలించిపోయారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కాలేజీకి మిగిలిన ఫీజును తాము చెల్లిస్తామని ప్రకటించారు. దీంతో చేయూతనందించిన న్యాయవాదులను జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ప్రత్యేకంగా అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

