హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ‘గోల్డెన్ అవర్చాలా కీలకం…ఏదైన ప్రమాదం జరిగినప్పటి నుంచి గంటలోపు సరైన చికిత్స అందిస్తే ఆ రోగి ప్రాణాలు కాపాడవచ్చు. స్టార్ హాస్పిటల్ వారు ప్రమాద స్థలికి కేవలం 12-15నిమిషాల్లో చేరుకుని, ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచే చికిత్స మొదలుపెట్టి, గోల్డెన్ అవర్‌లో రోగులను అంబులెన్స్‌లో దవాఖానకు తరలించే మహత్తర కార్యాన్ని చేపట్టడం అభినందనీయం’ అని ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ పేర్కొన్నారు. స్టార్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా.గోపీచంద్ మన్నం, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డా.రమేశ్గూడపాటి, గ్రూప్ లీడ్, ఎమర్జెన్సీ మెడిసిన్ అధిపతి డా.రాహుల్ కట్టాతో కలిసి అల్లు అరవింద్ బుధవారం నానక్‌రామ్‌గూడలోని స్టార్ హాస్పిటల్లో 10 ‘ట్రామా, యాక్సిడెంట్ రెస్పాన్స్ నెట్వర్క్’ అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నానక్‌రామ్‌గూడ పరిసరాల్లో ప్రమాదానికి గురైతే వెంటనే 9071104108కు, బంజారాహిల్స్ పరిసరాల్లో ఉన్నైట్టెతే 9100911911 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయవచ్చని వివరించారు. ప్రస్తుతం 10అంబులెన్స్‌లను ప్రారంభించామని త్వరలో మరిన్నింటిని అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు.
అంబులెన్స్ అందుబాటులో ఉండే ప్రాంతాలు
నార్సింగి, మణికొండ, టోలీచౌకి, గచ్చిబౌలి, కేపీహెచ్‌బీ, మియాపూర్, లింగంపల్లి, గౌలిదొడ్డి, మాదాపూర్, పటాన్చెరు ప్రాంతాల్లో ఈ స్టార్ ట్రామా, యాక్సిడెంట్ రెస్పాన్స్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు వివరించారు.