వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభం
రిజిస్ట్రేషన్లు| రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ సడలింపు దృష్ట్యా భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ధరణి పోర్టల్ ద్వారా నేటి నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ప్రకటించింది.

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ సడలింపు దృష్ట్యా భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ధరణి పోర్టల్ ద్వారా నేటి నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ప్రకటించింది. స్లాట్ల బుకింగ్ విధానంలో తహశీల్దార్ కార్యాలయ్యాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని పేర్కొంది. మాస్కు ధరించడం, భౌతిక దూరం వంటి కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.
వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు కూడా స్లాట్ బుకింగ్ ద్వారానే జరుగుతాయని పేర్కొంది. ఒక్కో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో రోజుకు 24 స్లాట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇద్దురు సబ్రిజిస్ట్రార్లు ఉన్నదగ్గర రోజుకు 48 స్లాట్లు ఉంటాయని వెల్లడించింది. క్రయ, విక్రేతలతోపాటు ఇద్దరు సాక్షులకు ఆన్లైన్ పాస్‌లు మంజూరు చేస్తామని, ఇతరులకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఏడుగురికి మించి రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉండకూడదని ఆదేశాలు జారీచేసింది. ఈసీలు, సీసీలు పూర్తిగా ఆన్లైన్ ద్వారానే జారీచేయాలని పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎగ్గొట్టినదానితో కలిపి ఎకరానికి రూ.60వేల రైతుబంధు వెంటనే చెల్లించాలి.. కేటీఆర్ డిమాండ్
KTR | ఇప్పుడు బెల్ట్ ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి.. రిటైర్డ్ ఇంజినీర్ల మీద రేవంత్ రెడ్డి బూతులపై కేటీఆర్ ధ్వజం
Diwali Parole | దీపావళి సందర్భంగా.. 143 మంది ఖైదీలకు పెరోల్
KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్
Gautam Prasad Yallapu | గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ‘ప్రొడక్షన్ నంబర్ 1’ చిత్రం.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

