కుత్బుల్లాపూర్,ఆగస్టు18: సుచిత్రలో లలితా జ్యువెల్లర్స్ 56వ బ్రాంచ్ అట్టహాసంగా ప్రారంభమైంది. లలితా జ్యువెల్లర్స్ ఎండీ ఎం.కిరణ్‌కుమార్ నేతృత్వంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖామంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, కూన శ్రీశైలంగౌడ్, స్థానిక కార్పొరేటర్ చెరకుపల్లి తారాచంద్రారెడ్డి, ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్, ఆయా పార్టీల శ్రేణులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ బంగారు భవిష్యత్‌కు నమ్మకమైన పెట్టుబడి బంగారమని తెలిపారు. జ్యువెల్లరీ రంగంలో అతితక్కువ కాలంలో లలిత జ్యువెలర్స్ విశేష ఆదరణ పొందిందని యాజమాన్యాన్ని అభినందించారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో కాంచీపురం వరమహాలక్ష్మీ సిల్క్స్ కొత్త షోరూమ్‌ను చాగంటి కోటేశ్వర్రావు ఆదివారం ప్రారంభించారు.
దేశ వ్యాప్తంగా సిల్క్ వస్ర్తాలకు మహిళల నుంచి మంచి ఆదరణ ఉందని, వారు మెచ్చే వివిధ డిజైన్ల బనారస్, ఉప్పాడ, ధర్మవరం చీరలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.