హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగా ణ): తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన డిప్యూటీ కలెక్టర్ల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా వీ లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శలుగా కే రామకృష్ణ, ఎన్ఆర్ సరిత, సెక్రటరీ జనరల్‌గా రమేశ్‌రాథోడ్, కోశాధికారిగా కే వెంకట్‌రెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్స్‌గా ఎం కృష్ణారెడ్డి, చిన్న వెంకటస్వామి, రమాదేవి, ఎం జనార్దన్‌రెడ్డి, ఎం శ్రీనివా స్, ఉపాధ్యక్షులుగా పీ పద్మప్రియ, ఎన్ రాజేందర్‌రెడ్డి, షేక్ హమీద్, ఎం విజయకుమారి, ఎల్ అలివేలు, కార్యదర్శులుగా ఎం ప్రభాకర్, వీ శేఖర్‌రెడ్డి, జీఎన్ వీ రాజువర్మ, ఈ అర్చన, పీ రాంరెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా టీ శ్యాంప్రసాద్, కేఎంవీ జనార్దన్‌రావు, కే వీణ, కదం సురేశ్, రాథోడ్ మోహన్‌సింగ్, డీ దేవుజ, కల్చరల్ సెక్రటరీలుగా భావయ్య, కే సురేశ్, వీ శ్రీదేవి, కార్యవర్గ సభ్యులుగా ఎల్లారెడ్డి, శ్రీరాందత్, ఆర్ గంగాధర్, అంబదాస్ రాజేశ్వర్, వై శ్రీనివాస్‌రెడ్డి, టీ వెంకటేశ్, డీ శ్రీధర్, దూలం మధు, కోమల్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికల ఇన్చార్జిగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (విశ్రాంత) రవీంద్రబాబు వ్యవహరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.