Vijaya Dairy | రావిర్యాలలో విజయ మెగా డెయిరీని ప్రారంభింనున్న మంత్రి కేటీఆర్.. లక్ష మంది పాడి రైతులకు ప్రయోజనం
రాష్ట్రంలో పాల ఉత్పత్తి, ప్రాసెసింగ్ పెంపుదలే లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన విజయ మెగా డెయిరీ ప్లాంట్ ప్రారంభానికి సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా రావిర్యాల గ్రామ (ఇమారత్ కంచ) పరిధిలోని 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు.
- 40 ఎకరాల్లో రూ.250 కోట్లతో నిర్మాణం
- 5 లక్షలకు పైగా లీటర్ల పాల ప్రాసెసింగ్
- రావిర్యాలలో ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
Vijaya Dairy | హైదరాబాద్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాల ఉత్పత్తి, ప్రాసెసింగ్ పెంపుదలే లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన విజయ మెగా డెయిరీ ప్లాంట్ ప్రారంభానికి సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా రావిర్యాల గ్రామ (ఇమారత్ కంచ) పరిధిలోని 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. ఈ మెగా డెయిరీని గురువారం రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ) సహకారంతో రోజూ 5 లక్షల నుంచి 8 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ సామర్థ్యంతో దేశంలోనే అత్యాధునిక, పూర్తిస్థాయి ఆటోమిషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో దీనిని నిర్మించారు.
ఈ డెయిరీ నిర్వహణకు మొత్తంగా సోలార్ విద్యుత్తునే వినియోగించనున్నారు. సోలార్ విద్యుదుత్పత్తి వ్యవస్థతోపాటు, వ్యర్థాల వినియోగంతో విద్యుత్తును ఉత్పత్తి చేసేలా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ మెగా డెయిరీ ఏర్పాటుతో రాష్ట్రంలోని సుమారు లక్ష మంది పాడి రైతులకు ప్రయోజనం కలుగనున్నది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే విజయ డెయిరీ వృద్ధిలోకి వచ్చిందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు.
విజయ మెగా డెయిరీ ప్రత్యేకతలు
- రూ.250 కోట్లతో 40 ఎకరాల్లో అత్యాధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం
- నిత్యం 5 లక్షల నుంచి 8 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్, ప్యాకేజింగ్
- రోజుకు లక్ష లీటర్ల టెట్రా బ్రిక్ పాల ప్యాకెట్ల తయారీ. ప్రతినెలా 30 టన్నుల వెన్న తయారీ
- రోజుకు 10 టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం గల యంత్ర పరికరాలు
- రోజుకు 5 వేల నుంచి 10 వేల లీటర్ల ఐస్ క్రీం తయారీ
- రోజుకు 20 టన్నుల పెరుగు ఉత్పత్తి
- రోజుకు 12 వేల లీటర్ల మజ్జిగ, లస్సీ తయారీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

