Civils Rank | కాకతీయ యూనివర్సిటీ అర్థశాస్త్ర ఆచార్యులు మంద అశోక్ కుమార్ కూతురు మంద అపూర్వ సివిల్స్ ఫలితాలలో 646వ ర్యాంకు సాధించారు. మంద అపూర్వ ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం ఎంటెక్ చేస్తున్నారు. హనుమకొండ ఎక్సైజ్ కాలనీలో నివసిస్తున్న అపూర్వ తల్లి మంద రజనీ దేవి ప్రభుత్వ టీచర్ గా భీమదేవరపల్లి మండలం మాణిక్య పూర్ లో పనిచేస్తున్నారు.
మందా అపూర్వకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు పెద్దన్నయ్య అరుణ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చిన్న అన్నయ్య అభినవ్.. పుణెలోని ఓ ఫార్మసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. మంద అపూర్వకు శాతవాహన యూనివర్సిటీ మాజీ ఉపకులపతి ఆచార్య మహమ్మద్ ఇక్బాల్ అలీ కేయూ అధ్యాపకులు ఆచార్య కూరపాటి వెంకటనారాయణ, డాక్టర్ ఎర్రబొజ్జు రమేష్ తదితరులు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంద అపూర్వ మాట్లాడుతూ.. `నా తల్లిదండ్రుల వల్లే విజయం సాధించా. ప్రత్యేకించి నా తల్లి నిత్యం నాకు మద్దతుగా ఉండేవారు. స్ఫూర్తినిచ్చారు. నేను సివిల్స్‌లో విజయం సాధిస్తానని నమ్మారు. నా ప్రయాణంలో నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించిన నా సోదరులకు, మిత్రులకు ధన్యవాదాలు` అని పేర్కొన్నారు.