కదంతొక్కిన అన్నదాతలు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానం కదనోత్సాహం తో శివమూగింది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గర్జన సభలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రణగర్జనకు రైతు లు మద్దతుగా నిలిచారు.
- కేటీఆర్ ప్రసంగిస్తుండగా జెండాలు ఊపుతూ, ప్లకార్డుల ప్రదర్శన
మంచిర్యాల, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానం కదనోత్సాహం తో శివమూగింది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గర్జన సభలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రణగర్జనకు రైతు లు మద్దతుగా నిలిచారు. ఆదిలాబాద్‌లో రైతుల గర్జన చూశాకైనా.. ఈ ప్రభుత్వం దిగి రావాలని, చచ్చుకుంటూ రైతులకు రైతుబంధు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
‘ఒకవేళ సర్కార్ వినకపోతే.. మనం ఇదే పని పెట్టుకుందాం.. వరుసగా సభలు పెట్టి తెలంగాణ వ్యాప్తంగా రైతులను కూడా కలుద్దాం’ అని కేటీఆర్ పిలుపునివ్వగా.. కుర్చీలు ఎక్కి గులా బీ జెండాలు ఊపుతూ కాంగ్రెస్ సర్కార్‌పై సమరానికి తాము సిద్ధమంటూ రైతులు సంజ్ఞలు చేశారు. కేటీఆర్ ప్రసంగంలో ఆదిలాబాద్ కవులు, రచయితలు రాసిన పుస్తకాలు, పాటల గురించి వివరిస్తూ.. స్థానిక రైతుల్లో స్ఫూర్తిని నింపారు.
గులాబీమయమైన ఆదిలాబాద్
బీఆర్ఎస్ రైతుగర్జన సభ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణం గులాబీమయమైంది. అడుగగునా భారీ ఫ్లెక్సీలు, జెండాలతో కళకళ లాడింది. కళాకారుల ఆటాపాటలకు రైతుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. స భకు వచ్చిన వేలాది మంది పాటలకు నృత్యా లు చేస్తూ కేటీఆర్‌పై అభిమానాన్ని చాటే ప్లకార్డులు ప్రదర్శిస్తూ కనిపించారు. కేటీఆర్ సభా వేదికకు చేరుకోగానే పండుగ వాతావరణంతో ఆయన స్వాగతం పలికారు. కుర్చీలు ఎక్కి జెండాలు ఊపుతూ, కేటీఆర్‌కు అభివాదం చేస్తూ జోష్‌లో ముగినిపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

