సింగరేణిని ప్రైవేటీకరిస్తే ఊరుకోం
సింగరేణిని ప్రైవేటీకరణ ముప్పు నుంచి కాపాడుకోవాలి. సంస్థలో జరుగుతున్న అవకతవకలు, టెండర్ల వ్యవహారాలపై రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఆర్థిక వ్యవహారాలు, బొగ్గు ఉత్పత్తి తగ్గుదల, టెండర్లలో అక్రమాల ఆరోపణలు, సంస్థకు రావాల్సిన నిధుల గురించి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సమన్వయంతో గుర్తింపు సంఘం ఎన్నికల్లో సత్తాచాటాలి. - కేటీఆర్
- కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటం
- అన్యాయం జరిగితే సహించబోం
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- కోల్‌బెల్ట్ ఏరియా ముఖ్యనేతలతో సమావేశం
- సింగరేణి గర్జన విజయంపై అభినందనలు
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : ‘తెలంగాణ కొంగుబంగారం సింగరేణిని ప్రైవేటీకరిస్తే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోబోదు.. సంస్థను బలహీనపరిచే దిశగా అడుగులేస్తున్న కాంగ్రె స్ సర్కార్ కుట్రలను అడ్డుకుంటాం.. ప్రభుత్వ పెద్దల అవినీతి నుంచి కాపాడుకుంటాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కార్మికుల సంక్షేమంపై రాజీపడే ప్రసక్తేలేదని, వారి హక్కుల కోసం బీఆర్ఎస్ నిరంతర పోరాటం చేస్తుందని ప్రకటించారు. గురువారం తెలంగాణ భవన్లో కోల్‌బెల్ట్ ఏరియా బీఆర్ఎస్ ముఖ్యనేతలు, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తదితరులతో కేటీఆర్ సమావేశమయ్యారు.
గోదావరిఖనిలో కార్మిక గర్జనను విజయవంతం చేసి న పార్టీ నేతలు, కార్యకర్తలను అభినందించారు. భవిష్యత్‌లోనూ ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని కోరారు. అనంతరం సింగరేణిలో ప్రస్తుత పరిస్థితులు, ప్రభు త్వం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంస్థ భవిష్యత్‌పై చర్చించారు. బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ బ లోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. గని కార్మికుల హక్కుల సాధన, సంస్థ పరిరక్షణకు పోరాటానికి సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. ఇటీవలి సభలో ప్రస్తావించిన సంస్థ ఆర్థిక వ్యవహారాలు, బొగ్గు ఉత్పత్తి తగ్గుదల, టెండర్లలో అక్రమాల ఆరోపణలు, సంస్థకు రావాల్సిన నిధులు తదితర అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సమన్వయంతో గుర్తింపు సంఘం ఎన్నికల్లో సత్తాచాటాలని కోరారు. కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకున్న సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకొనే ప్రసక్తిలేదని కేటీఆర్ తేల్చిచెప్పారు.
బీజేపీ సర్కార్ వైఖరిని ప్రశ్నించాలి
సింగరేణికి అన్యాయం చేస్తున్న రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలను గట్టిగా నిలదీయాలని కేటీఆర్ సూచించారు. రెండు ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాన్ని కార్మిక కుటుంబాలకు విడమరచి చెప్పాలని కోరారు. బీఆర్ఎస్ పాలనలో కార్మికుల సంక్షేమానికి తీసుకున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టంచేశారు. కార్మికులకు లాభాల వాటా, ఇచ్చిన వారసత్వ ఉద్యోగాలు, మెడికల్ బోర్డుల నిర్వహణ, కార్మిక కుటుంబాలకు కల్పించిన వైద్య సదుపాయాల గురించి వివరించాలని సూచించారు. కార్మికులకు రావాల్సిన లాభాల వాటా, పండుగల బోనస్, ఇతర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రశ్నించాలని, కార్మికుల హకుల సాధన కోసం క్షేత్రస్థాయిలో నిరంతరం అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేశారు. చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుందని పునరుద్ఘాటించారు.
ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు ఎదురొనేందుకు బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సమావేశంలో చర్చించారు. సింగరేణి ప్రాంతంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు కార్మికులకు అండగా ఉండాలని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ పాలనలో ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో కార్మికులు, సింగరేణి ప్రాంత ప్రజల్లో బీఆర్ఎస్కు ఆదరణ పెరుగుతున్నదని సమావేశంలో పాల్గొన్న నాయకులు అభిప్రాయపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్మిక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నామని వివరించారు. సంస్థ పరిరక్షణ, కార్మికుల హకుల సాధన, సంక్షేమ కార్యక్రమాల పునరుద్ధరణ, టీబీజీకేఎస్ బలోపేతం లక్ష్యం గా రానున్న రోజుల్లో సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించారు. కార్మికులకు అండగా ఉంటూ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతామని బీఆర్ఎస్ నాయకులు స్పష్టంచేశారు. సమావేశంలో కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు కోలేటి దామోదర్, చిరుమల్ల రాకేశ్, నాయకులు కౌశికహరి, విజయారెడ్డి, సమ్మయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

