ఆస్ట్రేలియా-కేసీఆర్ క్రికెట్ కప్ పోస్టర్ ఆవిష్కరణ
బీఆర్ఎస్ ఆస్ట్రేలియా-కేసీఆర్ క్రికెట్ కప్ పోస్టర్‌ను కౌలాలంపూర్‌లో కేటీఆర్ శనివారం ఆవిష్కరించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు మలేషియా వెళ్లిన కేటీఆర్‌ను ఆస్ట్రేలియా బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
- బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందానికి కేటీఆర్ అభినందన
- వచ్చే ఏడాది ఆవిర్భావ వేడుకలకు వస్తానని హామీ
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఆస్ట్రేలియా-కేసీఆర్ క్రికెట్ కప్ పోస్టర్‌ను కౌలాలంపూర్‌లో కేటీఆర్ శనివారం ఆవిష్కరించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు మలేషియా వెళ్లిన కేటీఆర్‌ను ఆస్ట్రేలియా బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ప్రతినిధులను కేటీఆర్ అభినందించారు. ఇండియన్ కమ్యూనిటీలో ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు 2023లో నిర్వహించిన క్రికెట్ టోర్నీకి ఎంతో ఆదరణ లభించిందని ఆస్ట్రేలియా బీఆర్ఎస్ నేత ఉప్పుల సాయిరాం తెలిపారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా నిర్వహించాలని సంకల్పించామని పేర్కొన్నారు.
కాగా పార్టీ రజతోత్సవ, రాష్ట్ర ఆవిర్భావ సంబురాలను ఈ ఏడాది ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ వేడుకలకు హాజరవుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్, పార్టీ రాష్ట్ర నేతలు బడుగుల లింగయ్య యాదవ్, నంద్యాల దయాకర్‌రెడ్డి, బాలమల్లు, బీఆర్ఎస్ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ రాపోలు, మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Australia
- BRS
- KCR cricket cup
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

