14న బుద్ధవనం ప్రారంభం
- ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
- విశిష్ట అతిథిగా మంత్రి జగదీశ్వర్‌రెడ్డి
- ఏర్పాట్లపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమీక్ష
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : ఆసియా ఖండంలోనే అతిపెద్దగా నాగార్జునసాగర్‌లో 274 ఎకరాల్లో నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్ట్‌ను ఈ నెల 14న మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు. ఈ ఏర్పాట్లపై పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్‌లో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సుమారు రూ.100 కోట్లతో ఆసియా ఖండంలోనే అతిపెద్ద బౌద్ధవనం ప్రాజెక్టును అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో నిర్మించామని చెప్పారు.

ఆచార్య నాగార్జునుడు రెండు వేల సంవత్సరాల కిందట నడియాడిన ప్రదేశంగా, ఆయన స్థాపించిన విజయపురి విశ్వవిద్యాలయం, బౌద్ధమత చరిత్ర ఆధారంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టులో బుద్ధ చరితవనం, జాతకవనం (బోధిసత్వ పార్), ధ్యానవనం, స్థూపవనం, మహాస్థూపం, బుద్ధిజం టీచింగ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్, హాస్పిటాలిటీ, వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. దేశ, విదేశాలకు సంబంధించిన 40 ప్రసిద్ధ జాతక కథ శిల్పాలు, మన దేశంతో పాటు దక్షిణాసియాలోని వివిధ దేశాలకు చెందిన 13 బౌద్ధ స్థూపాల నమూనాలను ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. 100 అడుగుల ఎత్తు, 200 అడుగుల వ్యాసంతో బౌద్ధ స్థూపం, దాని చుట్టూ వేలాది శిల్పాలను నిర్మించామన్నారు. తెలంగాణ టూరిజం ఎండీ మనోహర్, బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య, చరిత్రకారులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

