KTR | భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి చోసం తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ పోరాటాలు, త్యాగాలు చిరస్మరణీయం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి (చిట్యాల) ఐలమ్మ చూపించిన తెగువ తెలంగాణ ధీరత్వానికి తార్కాణం, బహుజన పోరాట పటిమకు ప్రతీక అని తెలిపారు. చాకలి ఐలమ్మ గొప్పతనాన్ని చాటిచెప్పే విధంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఐలమ్మ జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా చేర్చింది. అలాగే కేసీఆర్ పాలకుర్తి మార్కెట్ యార్డుకు ఐలమ్మ పేరు పెట్టారు. వారి జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారని గుర్తు చేశారు. నేడు వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించారు.
భూమి కోసం, భుక్తి కోసం తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ పోరాటాలు, త్యాగాలు చిరస్మరణీయం.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి (చిట్యాల) ఐలమ్మ గారు చూపించిన తెగువ తెలంగాణ ధీరత్వానికి తార్కాణం, బహుజన పోరాట పటిమకు ప్రతీక.
చాకలి ఐలమ్మ గొప్పతనాన్ని చాటిచెప్పే విధంగా కేసీఆర్ ప్రభుత్వం… pic.twitter.com/xpLuwwsQko
— KTR (@KTRBRS) September 10, 2026