KTR | తెలంగాణకు బీవైడీ.. బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి ఫలితమే: కేటీఆర్
రాష్ట్రానికి బీవైడీ కార్ల సంస్థ పెట్టుబడి రావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంతోషం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రానికి బీవైడీ సంస్థ వచ్చిందన్నారు. 2023లోనే 10 బిలియన్ డాలర్ల పెట్టుబడికి బీవైడీ, ఒలెక్ట్రా అంగీకారం కుదుర్చుకున్నాయని చెప్పారు.
హైదరాబాద్: రాష్ట్రానికి బీవైడీ కార్ల సంస్థ పెట్టుబడి రావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంతోషం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రానికి బీవైడీ సంస్థ వచ్చిందన్నారు. 2023లోనే 10 బిలియన్ డాలర్ల పెట్టుబడికి బీవైడీ, ఒలెక్ట్రా అంగీకారం కుదుర్చుకున్నాయని చెప్పారు. బీవైడీ కంపెనీ రాష్ట్రానికి రావడం ఫార్ములా-ఈ రేసు ప్రత్యక్షఫలితమని వెల్లడించారు. బీవైడీ రాకకు ఏండ్ల తరబడి కష్టపడిన అందరికి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.
‘బీఆర్ఎస్ ప్రభుత్వ కృషితోనే తెలంగాణకు బీవైడీ సంస్థ వచ్చింది. నాడు బీఆర్ఎస్ చేసిన కృషి.. నేడు ఫలితించింది. దిగ్గజ కంపెనీ భారీ పెట్టుబడితో యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. ఫార్ములా-ఈ రేసు నిర్వహణతో ప్రపంచం దృష్టిని తెలంగాణ ఆకర్షించింది. ప్రభుత్వాలు మంచి విధానాలు ప్రవేశపెడితే నీఛమైన రాజకీయాలను అధిగమించి మంచి ఫలితాలు వస్తాయి. తాము ప్రవేశపెట్టిన తెలంగాణ మొబిలిటీ వ్యాలీ, ఈవీ విధానం వల్లే ఈ రోజు బీవైడీ తెలంగాణకు వచ్చింది. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ, ఈవీ పాలసీ భాగంగానే ఫార్ములా-ఈ రేస్‌ను నిర్వహించాం. తమ విధానాల వల్లే తెలంగాణకు ఇంత భారీ పెట్టుబడి వచ్చింది. ఈ పెట్టుబడి కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు.’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

