KTR | మోదీ బడేభాయ్.. నేను ఛొటేభాయ్ అన్నరు..? ఇప్పుడు తత్వం బోధపడ్డందుకు సంతోషం..! సీఎం రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు..!
KTR | కేంద్రంతో తమ ప్రభుత్వానికి ఇప్పటి నుంచి బంధాలు, అనుబంధాలు, సత్సంబంధాలు ఉంటాయి. మోదీ బడేభాయ్.. నేను ఛొటేభాయ్ అన్నరు. అన్నదమ్ముల అనుబంధం.. మంచి అద్భుతమైన సినిమాను వేదికపై పండించారు. మరి ఏమైంది ఈ రోజు? ఏం జరిగింది? తనదాకా వస్తే కానీ ఇవాళ తత్వం తెలియలేదా? అంటూ సీఎం రేవంత్‌పై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
KTR | కేంద్రంతో తమ ప్రభుత్వానికి ఇప్పటి నుంచి బంధాలు, అనుబంధాలు, సత్సంబంధాలు ఉంటాయి. మోదీ బడేభాయ్.. నేను ఛొటేభాయ్ అన్నరు. అన్నదమ్ముల అనుబంధం.. మంచి అద్భుతమైన సినిమాను వేదికపై పండించారు. మరి ఏమైంది ఈ రోజు? ఏం జరిగింది? తనదాకా వస్తే కానీ ఇవాళ తత్వం తెలియలేదా? అంటూ సీఎం రేవంత్‌పై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్‌పై చర్చలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ అన్న పదమే నిన్న బడ్జెట్ ప్రసంగంలో వినిపించలేదని శ్రీధర్‌బాబు అన్నరు అది వాస్తవమే. ఎందుకు వినబడలేదు ? ఆ నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే శాసనసభలో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు. ఈ రోజు పార్లమెంట్లో తెలంగాణ అన్న పదం లేదంటే.. దానికి కారణం అక్కడ బీఆర్ఎస్ లేకపోవడమే తప్ప మరొకటి కాదు. గులాబీ జెండా ఎగిరినంకనే తెలంగాణ పేరు ఇక్కడ, అక్కడ ఉండేది. ఈ రోజు అక్కడ లేకకుండాపోయింది. కేంద్రం బడ్జెట్ చూశాక ఇవాళ తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే.. లెక్కలు తప్పినయ్. 8 ప్లస్ 8 మామూలు గణితమైతే 16. కానీ, 8 ప్లస్ 8 గుండుసున్నా అని తెలంగాణ ప్రజలు అనుకే పరిస్థితి వచ్చింది’ అన్నారు.
మీకు ఇప్పుడు అర్థమైంది..
‘ఎందుకంటే తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతిబిడ్డకు కలిగిన భావన నిన్న.. ఈ పది సంవత్సరాలు ఏదైతే అన్యాయం జరిగిందో.. అదే అన్యాయానికి కొనసాగింపుగా ముందుకెళ్తున్నది. హాస్యాస్పదం ఏంటంటే.. మమ్మల్ని ముఖ్యమంత్రి ఏమన్నారంటే.. కేసీఆర్ అవనసరంగా పంచాయితీ పెట్టుకున్నరు. ముఖ్యమంత్రి కెలికి పంచాయితీ పెట్టుకొని అవనసర భేషజాలకు పోయిండు కాబట్టే.. పదేళ్లు ఏం కాలేదు. అందుకే నేను సఖ్యతతో ఉంటా అన్నరు. ఇక్కడ హైదరాబాద్‌లో మీటింగ్‌కు మోదీ వస్తే.. ఏమన్నరు. మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటి నుంచి బంధాలు, అనుబంధాలు, సత్సంబంధాలు ఉంటయ్. మోదీ బడేభాయ్.. నేను ఛొటేభాయ్ అన్నారు. అన్నదమ్ముల అనుబంధం.. మంచి అద్భుతమైన సినిమాను వేదికపై పండించారు. మరి ఏమైంది ఈ రోజు? ఏం జరిగింది? తనదాకా వస్తే కానీ ఇవాళ తెలియలేదా? ఇవాళ శ్రీధర్‌బాబు సవతి తల్లిప్రేమ, కక్ష, వివక్ష అని మాట్లాడుతున్నరు. మరి మేం చెప్పిందేంది గదే ఇన్నిరోజులు. మీదాకా వస్తే తత్వం అర్థమైంది’ అన్నారు.
చాలా పనులు సాధించాం..
‘వాళ్లు ఎలా వ్యవహరిస్తరో.. ఎన్నిసార్లు తిరిగినా.. ఎక్కే విమానం.. దిగేవిమానం అన్నట్లు.. 20సార్లు ఢిల్లీలో దిగినా అక్కడ ఏం జరుగదన్న విషయం మీకు ఇప్పుడు అర్థమైంది మీకు. ఇప్పటికైనా తత్వం బోధపడ్డందుకు సంతోషం. కాకపోతే మీలాగా మాకు కొన్ని అలవాట్లు లేవు. మేం ప్రయత్నం చేశాం.. చాలా పనులు సాధించాం. కానీ, ఇతరులు సాధించింది మాఖాతాలో వేసుకునే అలవాటు మాకు లేదు. అందరితో కొట్లాడి ఎలివేటెడ్ కారిడార్లు, రక్షణశాఖ భూములు మా ప్రభుత్వం హయాంలో వర్క్ జరిగితే.. కాగితం మీరున్నప్పుడు వస్తే.. మే సాధించామని గొప్పలు చెప్పుకున్నరు. ఏం ఫర్వాలేదు. 30వేల ఉద్యోగాలు మేమిస్తే మేమే ఇచ్చామని గొప్పలు చెప్పుకున్నరు అదికూడా ఫర్వాలేదు. ఇప్పటికైనా తత్వం బోధపడిందేమోనని భావిస్తున్నాను’ అన్నారు.
Read Also :
Harish Rao | ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం పూర్తయ్యేదెన్నడూ..? ప్రశ్నించిన హరీశ్‌రావు
Harish Rao | ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారం.. కొత్త ఉద్యోగుల నియామకం ఎప్పుడు..? : హరీశ్‌రావు
KTR | మీకు కేసీఆర్ అవసరం లేదు.. మేం సరిపోతాం.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్..!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

