Harish Rao | ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారం.. కొత్త ఉద్యోగుల నియామకం ఎప్పుడు..? : హరీశ్‌రావు
Harish Rao | ఆర్టీసీలో ఉద్యోగులపై పనిభారం మోపుతున్నారని.. కొత్త ఉద్యోగులను ఎప్పుడు నియమిస్తారని మంత్రి హరీశ్‌రావు శాసనసభలో ప్రశించారు. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్‌లో మాట్లాడారు.
Harish Rao | ఆర్టీసీలో ఉద్యోగులపై పనిభారం మోపుతున్నారని.. కొత్త ఉద్యోగులను ఎప్పుడు నియమిస్తారని మంత్రి హరీశ్‌రావు శాసనసభలో ప్రశించారు. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్‌లో మాట్లాడుతూ.. ‘మహాలక్ష్మి పథకం తెచ్చారు సంతోషం. అభినందిస్తున్నాం. ఈ పథకానికి నెలనెల బిల్లులు విడుదల చేయని మాట వాస్తవమా? మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన నిధులు ఎన్ని ? ఇప్పటి వరకు ఇచ్చినవి ఎన్ని.. ఇవ్వకపోవడం వల్ల కార్మికుల పీఎఫ్, సీసీఎస్ డబ్బులు మళ్లించి కార్మికులకు జీతాలు ఇచ్చిన మాట వాస్తవమా? ఆ నిధులు ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు
మా ప్రభుత్వంలో 44శాతం ఫిట్మెంట్ ఇచ్చాం..
‘గతంలో మా ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు 43శాతం ఫిట్మెంట్ ఇస్తే ఆర్టీసీ కార్మికులకు 44శాతం ఇచ్చాం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కార్మికులకు బడ్జెట్లో రూ.100కోట్లు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.200కోట్లు పెట్టింది. కానీ, ప్రభుత్వం రూ.1000కోట్లు, రూ.1500కోట్లు, రూ.1500కోట్లు బడ్జెట్లో పెట్టి ఆర్టీసీ సంస్థను కాపాడాం’ అన్నారు. మధ్యలో హరీశ్‌రావు మాట్లాడుతుండగా మంత్రి శ్రీధర్‌బాబు ప్రసంగానికి అడ్డు తగిలారు. క్వశ్చన్ అవర్‌లో ప్రసంగాలు ఇస్తున్నారన్నారు అన్నారు. దీనికి హరీశ్‌రావు స్పందిస్తూ సూటిగా మంత్రికి ప్రశ్నలు వేశానన్నారు. ఆర్టీసీకి సంబంధం విషయాలు, రాజకీయాల జోలికి వెళ్లలేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. ‘ఆర్టీసీలో దివ్యాంగులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు రాయితీతో బస్‌పాస్‌లు ఇస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల్లో రాయితీలకు సంబంధించి ఒక్క రూపాయి ఇవ్వమని మాట వస్తవమా? ఆ డబ్బు ఎంతా? ఎప్పటి వరకు ఇస్తారు ? ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటీ? అని ప్రశ్నించారు.
శాసనసభ ద్వారా ఉద్యోగులకు తీపికబురు చెప్పాలి..
‘కార్మికులకు మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ఉంటుంది. డ్రైవర్లు, కండక్టర్లు ఎనిమిది గంటలకంటే ఎక్కువ పని చేయకూడదని ఉంటుంది. అందులో మహిళా కండక్టర్లు కూడా ఉన్నారు. వారిని 16గంటలు, 18 గంటలు పని చేయించడం వల్ల పని ఒత్తిడికి లోనై వందల సంఖ్యలో కార్మికులు చనిపోతున్న మాట వాస్తవమా? మహాలక్ష్మి పథకం వచ్చాక ఓవర్‌లోడ్ కావడం ద్వారా పనిగంటల భారం పెరిగి.. దానికి సరిపడా కండక్టర్లు, డ్రైవర్లను నియామకం చేయకపోవడం వల్ల కార్మికులు ఓవర్‌టైం చేసి ఇబ్బందులుపడున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? దానికి అనుగుణంగా నియామకం ఎప్పటిలోగా చేస్తారు? ప్రభుత్వాన్ని రాజకీయాల్లోకి వెళ్లకుండా వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రక్రియ ఏర్పాటు చేయాలని.. స్పెసిఫిక్ డేట్ ఇచ్చి.. రాష్ట్రంలో ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఈ సభ ద్వారా తీపికబురు అందించాలని స్పీకర్ ద్వారా సీఎం, రవాణాశాఖ మంత్రిని కోరుతున్నా’నన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

