దేశంలోనే అతి పెద్ద టన్నెల్ అక్వేరియం
భారతదేశంలోనే అతి పెద్ద అక్వేరియాన్ని హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డును ఆనుకొని ఉన్న కొత్వాల్‌గూడలో నిర్మిస్తున్నట్టు మున్సిపల్‌శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. పనులు చురుగ్గా సాగుతున్నాయని సోమవారం ట్విట్టర్లో వెల్లడించారు. ట్విట్టర్లో ప్రేమ్ అనే నెటిజన్ ‘మన హైదరాబాద్‌లో టన్నెల్ అక్వేరియం ఎందుకు లేదు? ఏదైనా అద్భుతమైన సరస్సు కింద ఇది సాధ్యం కాదా?
- కొత్వాల్‌గూడలో చురుగ్గా నిర్మాణం
- ట్విట్టర్లో వెల్లడించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): భారతదేశంలోనే అతి పెద్ద అక్వేరియాన్ని హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డును ఆనుకొని ఉన్న కొత్వాల్‌గూడలో నిర్మిస్తున్నట్టు మున్సిపల్‌శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. పనులు చురుగ్గా సాగుతున్నాయని సోమవారం ట్విట్టర్లో వెల్లడించారు. ట్విట్టర్లో ప్రేమ్ అనే నెటిజన్ ‘మన హైదరాబాద్‌లో టన్నెల్ అక్వేరియం ఎందుకు లేదు? ఏదైనా అద్భుతమైన సరస్సు కింద ఇది సాధ్యం కాదా?
దయచేసి తెలంగాణకు అద్భుతమైన టన్నెల్ అక్వేరియాన్ని బహుమతిగా ఇవ్వండి. సార్ దయచేసి ఆలోచించండి’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద అక్వేరియం నిర్మాణం కొత్వాల్‌గూడలో ప్రారంభమైందని తెలిపారు. కొత్వాల్‌గూడలో సుమా రు 85 ఎకరాల్లో నిర్మిస్తున్న ఎకో పార్కు, అందులోనే దేశంలోనే అతి పెద్ద అక్వేరియం, ఏవియరీ కేంద్రం వివరాలను, వాటి ఫొటోలను షేర్ చేయాలని పురపాలకశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ అధికారులకు మంత్రి సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

