KTR | హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఆర్థిక వివేకం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన లక్షణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కే తారకరామారావు అ న్నారు. మొత్తం పన్నులో 84.2 శాతం సొం త రాబడి పన్ను వసూళ్లు సాధించి తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలవడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక వివేకం పాటించామని, దాని ఫలితాలు స్పష్టంగా ఉన్నాయని ట్వీట్ చేశారు. ఈ మేరకు పత్రికల్లో వచ్చిన ఆర్బీఐ నివేదిక కథనాన్ని ట్యాగ్ చేశారు.
గురువారం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్ర మాణం చేసిన కేటీఆర్, వరుసగా ఐదు సార్లు (2010 ఉప ఎన్నికలు సహా) తనను దీవించి అసెంబ్లీకి పంపినందుకు సిరిసిల్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నా యకులు కూడా కృతజ్ఞతలు తెలిపారు.