Inter Admissions | ఇంటర్ సెకండియర్‌లో అడ్మిషన్లు డ్రాప్.. ఫస్టియర్‌లో పెరిగినా.. సెకండియర్‌లో ఢమాల్
Inter Admissions | ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ సెకండియర్ అడ్మిషన్లు భారీగా తగ్గుతున్నాయి. ఫస్టియర్ నుంచి సెకండియర్‌కు ప్రమోట్ అయ్యే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతున్నది. ఏటా 10-20వేల మంది విద్యార్థులు తగ్గుతున్నారు.
Inter Admissions | హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ సెకండియర్ అడ్మిషన్లు భారీగా తగ్గుతున్నాయి. ఫస్టియర్ నుంచి సెకండియర్‌కు ప్రమోట్ అయ్యే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతున్నది. ఏటా 10-20వేల మంది విద్యార్థులు తగ్గుతున్నారు. ముఖ్యంగా 2025-26 విద్యాసంవత్సరంలో అంతకుముందు సంవత్సరంతో పోల్చితే ఏకంగా 17 వేల మంది విద్యార్థులు తగ్గారు. ఫస్టియర్ నుంచి సెకండియర్‌కు రిటెన్షన్ రేటు ఆందోళన కలిగిస్తున్నది. ఇంటర్ విద్యాశాఖ కేవలం ఫస్టియర్ అడ్మిషన్లపైనే ఫోకస్ పెడుతున్నది. సెకండియర్‌లో నిలుపుదల.. కొత్త అడ్మిషన్లపై అంతగా దృష్టిసారించడం లేదు. డ్రాపౌట్ అయిన విద్యార్థులు మళ్లీ చదువులు కొనసాగించేందుకు చొరవ తీసుకోవడంలేదు.
ఒక వైపు ఫస్టియర్, సెకండియర్ రెండు కోర్సుల్లోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఇటీవల పెరుగుతున్నది. 2022-23లో 1.80లక్షలుండగా,2023-24లో 1.63 లక్షలకు తగ్గింది. ఈ ఒక్క ఏడు మినహాయించగా.. ఆ తర్వాత క్రమంగా పెరుగుతున్నది. 2024-25లో 1.68లక్షలకు పెరుగగా.. 2025-26లో 1.72లక్షలకు చేరుకున్నది. ఈ పెరుగుదల ఫస్టియర్కే పరిమితమైనట్టు గణాంకాలను బట్టి తెలుస్తున్నది. ఫస్టియర్‌లో చేరుతున్న విద్యార్థులను సెకండియర్ వరకు కొనసాగించడంలో కాలేజీలు ఎందుకు విఫలమవుతున్నాయి..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థులు మధ్యలోనే డ్రాప్ అయ్యేందుకు గల కారణాలేమిటీ..? ప్రైవేట్ కాలేజీలకు తరలిపోతున్నారా..? లేక ఫెయిలైన వారు ఆర్థిక పరిస్థితులతో చదువులకు గుడ్‌బై చెబుతున్నారా..? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ అంశాలపై ప్రభుత్వం సమగ్రంగా అధ్యయనం చేయించాల్సిన అవసరమున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మరికొన్ని వివరాలు..
- 2021-22లో ఫస్టియర్‌లో 1.10లక్షల విద్యార్థులుండగా, 2022-23లో సెకండియర్‌లో రూ.89,993కు పడిపోయింది. అంటే 20,137కు పడిపోయింది.
- 2022-23లో ఫస్టియర్‌లో 90,393 మంది చేరారు. 2023-24లో వీరంతా సెకండియర్‌కు ప్రమోట్ కావాలి. కానీ ఈ ఏడాది సెకండియర్‌లో విద్యార్థుల సంఖ్య 78,412 తగ్గింది. ఏడాది కాలంలో11,981 మంది తగ్గారు.
- ఒక్క 2023-24 విద్యాసంవత్సరం నుంచి 2024-25 రెండు విద్యాసంవత్సరాల్లో ఫస్టియర్ నుంచి సెకండియర్‌కు ప్రమోట్ అయిన విద్యార్థుల సంఖ్య 84,967 సమానంగా ఉంది.
- మరుసటి ఏడాదికి వచ్చేసరికి అడ్మిషన్లు భారీగా తగ్గాయి. 2024-25 విద్యాసంవత్సరంలో ఫస్టియర్‌లో 83,845 మంది చేరాగా.. ఇదే విద్యార్థుల సంఖ్య సెకండియర్‌కు వచ్చేసరికి 67,105కు పడిపోయింది. అంటే 16,740 మంది డ్రాప్ అయ్యారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

