BRS Working President KTR | ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) ఉప ముఖ్యమంత్రి (Deputy CM), నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar Pawanovich) సింగపూర్‌లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్నిప్రమాదం జరుగగా.. అతని చేతులు, కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఓ దవాఖానలో అతను చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనపై ఇప్పటికే పలువురు రాజకీయ నేతలతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
తాజాగా మార్క్ శంకర్ కు ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. సింగపూర్ లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్టు తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యానని కేటీఆర్ అన్నారు. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని కేటీఆర్ రాసుకోచ్చాడు.
సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం @PawanKalyan గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు తెలుసుకుని దిగ్భ్రాంతికి లోనయ్యాను
ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. I pray for the well being of the young boy
— KTR (@KTRBRS) April 8, 2025