రాష్ట్ర సీఈవోను తలపించిన కేటీఆర్

- తెలంగాణలో పరిశ్రమలకు ప్రోత్సాహం
- మాకు ఘన స్వాగతం లభించింది
- కేరళలో ఒక్క రూపాయీ పెట్టుబడి పెట్టం
- కిటెక్స్ చైర్మన్ సాబు ఎం జాకబ్ వెల్లడి
కొచ్చి, జూలై 12: కేరళలో ఇకపై ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టబోమని కిటెక్స్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సాబు ఎం జాకబ్ తెలిపారు. తమ రెండు రోజుల పర్యటనలో తెలంగాణ రాష్ట్రంలో ఘన స్వాగతం లభించిందని చెప్పారు. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో జరిపిన చర్చలు ఆ రాష్ట్ర సీఈవోతో నిర్వహించిన చర్చల్లా ఉన్నాయని అభివర్ణించారు. తెలంగాణలో ప్రాథమికంగా రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సంబంధించిన ప్రక్రియను త్వరలో ఖరారు చేస్తామన్నారు. కేరళ పరిశ్రమల శాఖను ‘బావిలో కప్ప’తో పోలుస్తూ ఇతర రాష్ర్టాల్లో పెట్టుబడిదారులకు ఉన్న స్నేహపూర్వక వాతావరణం గురించి దానికి తెలియదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను ఇస్తామని చెప్పడంతో పాటు తనిఖీల పేరిట ఇబ్బందులకు గురిచేయబోమని హామీ ఇచ్చిందని తెలిపారు. తెలంగాణలో పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ‘మాకు తెలంగాణలో ఘన స్వాగతం లభించింది. పెట్టుబడి ప్రక్రియను రెండు వారాల్లో ఖరారు చేస్తా’మని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇతర రాష్ర్టాలు ఇస్తున్న ప్రోత్సాహకాలు ఏమిటో తెలుసుకునేందుకు తెలంగాణ పర్యటన ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు చౌకగా భూమి, నీరు, విద్యుత్తు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. కిటెక్స్… కేరళకు చెందిన వస్త్ర తయారీ, ఎగుమతి సంస్థ. కేరళ అధికారుల వేధింపులను భరించలేకపోతున్నామని ఆరోపిస్తూ రాష్ట్రం నుంచి తమ రూ.3,500 కోట్ల విలువైన ప్రాజెక్టును ఉపసంహరిస్తామని జాకోబ్ ఇటీవల ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

