‘రుటూర్’తో మొబిలిటీలో సరికొత్త మార్పులు
వరంగల్ కేంద్రంగా రూపుదిద్దుకున్న స్వదేశీ మొబిలిటీ ఫ్లాట్‌ఫామ్ ‘రుటూర్' ఆవిష్కరణ రవాణా రంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆకాంక్షించారు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- స్టార్టప్ రూపకర్తలకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తేతెలంగాణ): వరంగల్ కేంద్రంగా రూపుదిద్దుకున్న స్వదేశీ మొబిలిటీ ఫ్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ఆవిష్కరణ రవాణా రంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆకాంక్షించారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం నిర్వాహకులతో కలిసి రుటూర్ యాప్‌ను ఆవిష్కరించారు.
రుటూర్ ప్రత్యేకత గురించి ఎక్స్ వేదికగా పంచుకున్నారు. రుటూర్ సంస్థను స్థాపించిన అశోక్‌ను, సీఈవో నిఖిల్, సీవోవో క్రాంతి, సీఎఫ్‌వో అక్షయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రుటూర్ స్టార్టప్ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ సిస్టంకు మరింత తోడ్పాటునందించాలని ఆకాంక్షించారు.
నమ్మకమైన రైడ్ సేవలు, వినూత్న సాంకేతికత, డ్రైవర్ల నుంచి కమీషన్లు వసూలు చేయకుండా ప్రయాణికులకు సరసమైన ధరల్లో రవాణా సేవలందించాలని అభిలషించారు. రైడర్లకు మెరుగైన ఆదాయ వనరులు కల్పిస్తూ, ప్రయాణికులకు అందుబాటు ధరల్లో సౌకర్యవంతమైన రవాణా సేవలను అందించి వారి ఆదరాభిమానాలు చూరగొనాలని సూచించారు. ఈ సంస్థ అద్భుతమైన విజయాలు సాధించాలని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

